కమీషనర్ దృష్టికి పలు సమస్యలు – TIGLA, TIPS

ఈరోజు TIGLA & తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ఇంటర్ విద్యా సంఘం & ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి & 475 అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్ విద్య కమీషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ ని కలిసి ఇంటర్ విద్యలో వున్న పలు సమస్యలను మరియు రాబోవు వార్షిక పరీక్షల్లో విధులను సీనియార్టీ ప్రకారం న్యాయముగా అధ్యాపకులకు కేటాయించాలని విన్నవించడం జరిగిందని జంగయ్య, రామకృష్ణ గౌడ్ తెలిపారు.

ఈ సందర్భంగా కాంట్రాక్టు అధ్యాపకుల సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సమాచారాన్ని మరియు ఇంకా ఇవ్వవలసిన సర్టిఫికెట్ల రిమార్క్స్ కు సంబంధించిన జాబితాను అధికారిక వెబ్ సైట్ లో పారదర్శకంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూడాలని కోరటం జరిగింది. అలాగే క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసి సచివాలయానికి పంపించవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది.

అలాగే క్రమబద్ధీకరణ ప్రక్రియ సందర్భంగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ నుండి ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకున్న సందర్భంలో ప్రధానాచార్యుల నుండి ఎకానాలెడ్జ్మెంట్ ను సంబంధిత కాంట్రాక్ట లెక్చరర్ కు ఇప్పించాలని కోరడం జరిగింది.

ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేసినందుకు కమీషనర్ ఉమర్ జలీల్ కు ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మైలారం జంగయ్య, మాచర్ల రామకృష్ణ గౌడ్, డాక్టర్ ఎ. వెంకటేశ్వర్లు, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, శ్రీనివాస్ రెడ్డి, పోలా రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.