ప్రభుత్వానికి రుణపడి ఉంటాం – ఆల్ పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్

ఈరోజు కాంట్రాక్టు లెక్చరర్ క్రమబద్దీకరణ పై హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల తెలంగాణ ఆల్ పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అధ్యక్షులు జి. ఉదయభాస్కర్ హర్షం వ్యక్తం చేశారు.

కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఎన్నో సంవత్సరాలుగా కష్టాలతో కూడిన సర్వీస్ ను గుర్తించి ప్రతి కాంటాక్ట్ లెక్చరర్ ను క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన జీవ 16 న్యాయ వ్యవస్థ నుండి పూర్తి సహకారం లభించినట్లు అయిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కాంట్రాక్ట్ లెక్చరర్స్ కుటుంబాల తరపున జీవితాంతం ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉంటామని జనరల్ సెక్రెటరీ సునీల్ మరియు నవీన్ కుమార్ తెలిపారు.