హైకోర్టు తీర్పు పట్ల హర్షాతిరేకాలు- 711 సంఘం మహబూబ్ నగర్ జిల్లా

మహబూబ్ నగర్ జిల్లా: ఈ రోజు తెలంగాణ హైకోర్టు లో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ సంబంధించిన జీవో నెంబర్ 16 వ్యతిరేకిస్తూ పి హెచ్ డి స్కాలర్స్ వేసిన కేసును ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం కొట్టి వేయడం పట్ల మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు ఎం. వెంకట్ రాములు, ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు కట్టుబడి ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి, ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు, కాంట్రాక్టు అధ్యాపకుల గౌరవ అధ్యక్షులు శ్రీ తన్నీరు హరీష్ రావుకి , ఐటీ శాఖ మాత్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావుకి‌ సబితా ఇంద్రారెడ్డి కి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి రెడ్డి కి, పర్యాటక శాఖ మాత్యులు వి .శ్రీనివాస్ గౌడ్ కి, తెలంగాణ అడ్వకేట్ జనరల్ కి, అదేవిధంగా తెలంగాణ కాంట్రాక్టు లెక్చరర్ల జేఏసీ చైర్మన్ శ్రీ కనక చంద్రం కి కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే తెలంగాణ కాంట్రాక్టు లెక్చరర్ల కుటుంబాలు మొత్తం ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.