హైకోర్టు తీర్పు హర్షనీయం – ఆసిఫాబాద్ జిల్లా ఆర్జేడీ అపాయింటెడ్ సీజేఎల్స్

తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 16ను రద్దు చేయాలని కోరుతూ డాక్టరేట్స్ అసోసియేషన్ వేసిన పిటిషన్ ను ఈ రోజు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొట్టివేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఈ తీర్పు పట్ల ఆసిఫాబాద్ జిల్లా ఆర్జేడీ అపాయింటెడ్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు బంద్రపు గంగాధర్, ప్రధాన కార్యదర్శి రంజత్ ల హర వ్యక్తం చేశారు.

ఇందుకు సహకరించిన ప్రభుత్వ పెద్దలు సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలియజేశారు.