హైకోర్టు తీర్పు ఆనందదాయకం : TIGLA, TIPS

TIGLA

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు వ్యతిరేకంగా కొంతమంది దళారులు వెనుక వుండి “తెలంగాణ డాక్టరేట్స్ అసోసియేషన్” పేరుతో వేసిన పిటిషన్ గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ కొట్టివేయడం జరిగిందని… గతంలోనే ఈ కేసుపై పూర్తి వాదనలు జరిగి గౌరవ హైకోర్ట్ తీర్పు ఇవ్వడం జరిగిందని ఇక దీనిపై చర్చించడం అవసరం లేదని వ్యాఖ్యానిస్తూ గౌరవ చీఫ్ జస్టిస్ కేసును కొట్టివేయడం జరిగిందని TIGLA, TIPS సంఘాల ప్రతినిధులు జంగయ్య, రామకృష్ణ గౌడ్ తెలిపారు.

న్యాయస్థానాల కేసుల విషయంలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉండి క్రమబద్దీకరణకు కంకణ బద్దులుగా పనిచేస్తున్న మిత్రులకు మరియు సహకరిస్తున్న ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు & ప్రత్యేకంగా శ్రీ G.V.L మూర్తి, సీనియర్ అడ్వకేట్ కు ధన్యవాదాలు మరియు కాంట్రాక్టు అధ్యాపక మిత్రులకు హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.