మోడల్ స్కూల్ టీచర్ల పదోన్నతులు‌, బదిలీలకు గ్రీన్ సిగ్నల్

  • సబితా ఇంద్రారెడ్డి హమీ ఇచిన్నట్లు తరాల జగదీష్ ప్రకటన
  • హెల్త్ కార్డ్, నోషనల్ సర్వీస్ సమస్యలకు త్వరలో పరిష్కారం.

నేడు ఉపాధ్యాయ సంఘాలతో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశంలో PRTU TS రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి , కమలాకర్ రావు మరియు గౌరవ ఎమ్మెల్సీలు జనార్ధన్ రెడ్డి, రఘోత్తం రెడ్డి, రవీందర్ ఆధ్వర్యంలో PMTA TS రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి పలు సమస్యలు విన్నవించగా మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు జరుపుటకు నిర్ణయించడం జరిగింది.

సుధీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల తీవ్ర సమస్యకు నేడు PRTU ఆద్వర్యంలో PMTA సంఘము పరిష్కారం చూపి మరోసారి PMTA TS సంఘం సత్తాను చాటడం జరిగింది. త్వరలో హెల్త్ కార్డు, ప్రత్యేకముగా నోషనల్ సర్వీస్ సమస్య కూడా పరిష్కారం దిశగా హామీ ఇవ్వడం జరిగింది.

మోడల్ స్కూల్ బదిలీలు ప్రమోషన్లు నిర్ణయం తీసుకొన్నందుకు ముఖ్య మంత్రి కెసిఆర్ కి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, ప్రిన్సిపాల్ సెక్రటరీకి, విద్యా శాఖ కమీషనర్ కి, మోడల్ స్కూల్ అదనపు సంచాలకులు ఉషారాణికి ఇందుకు సహకారం అందించిన మా MLC లకు, PRTU రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సమావేశంలో సంఘ సభ్యులు అక్కెనెపల్లి శ్రీనివాస్, బాబ్లా నాయక్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.