క్రమబద్దీకరణ పై నేడు హైకోర్టు లో వాదనలు

కాంట్రాక్టు అధ్యాపకులు, ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై జారీ అయిన జీవో నంబర్ 16 రద్దు కోరుతూ వేసిన పిల్ 122/2017 ను తెలంగాణ హై కోర్టు గతంలోనే కొట్టివేసిన విషయం తెలిసిందే. దానితో క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభమై కొనసాగుతుండగా తాజాగా మళ్లీ హైదరాబాద్ కు చెందిన డాక్టరేట్స్ అసోసియేషన్ తరపున అదే జీవో నెంబర్ 16 ను రద్దు కోరుతూ 17709/2022 పిల్ హైకోర్టులో నమోదు కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏప్రిల్ 6న ఈ కేసు రిజిస్టర్ కాగా ఈరోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచి ముందుకు వాదనలకు రానుంది.

ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్, కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం తరపున జీవిఎల్ మూర్తి ఈ కేసులో వాదించనునున్నారు. డాక్టరేట్స్ అసోసియేషన్ తరపున కెవి రాజశ్రీ వాదించనునున్నారు.

ఒక అంశంపై హైకోర్టు తాజాగా కేసు కొట్టి వేయగా మళ్లీ అదే అంశం పై కేసు నమోదు కావడం పట్ల పలువురు కాంట్రాక్టు ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణను ప్రభావితం చేయనున్న ఈ కేసు పట్ల అత్యంత ఆత్రుతతో కాంట్రాక్టు ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.