పదవీ విరమణ వయోపరిమితి పెంపుకై వినతిపత్రం

జగిత్యాల : రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి 61 సంవత్సరాలు పెంచిన జీవోను కాంట్రాక్టు లెక్చరర్లకు వర్తింపజేయుటకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి జగిత్యాల జిల్లా 475 సంఘ సభ్యులు ఈరోజు శాసనమండలి సభ్యులు తాటిపర్తి జీవన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది.

ఈ సంధర్భంగా ప్రభుత్వం, అధికారులతో మాట్లాడి వయో పరిమితి పెంపుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని జిల్లా అధ్యక్షుడు రెమిడి మల్లారెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా 475 అధ్యక్షులు రేమిడి మల్లారెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు అత్తినేని శ్రీనివాస్ జిల్లా నాయకులు సత్యనారాయణ, బాల మల్లయ్య , వెంకట నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.