మైనారిటీ గురుకులాల్లో ప్రవేశ పరీక్షల తేదీల వెల్లడి

తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ గురుకులాల్లో ప్రవేశ పరీక్షల తేదీలను ఆ సంస్థ కార్యదర్శి బీ షఫీఉల్లా ప్రకటించారు. మే 15న 5వ తరగతి, 22న 6 నుంచి 8వ తరగతులకు ప్రవేశపరీక్షను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు జూన్ 4న పరీక్ష ఉంటుందని చెప్పారు.

వివరాలకు tmreis.telangana.gov.in మరియు 040-23487909 సంప్రదించవచ్చని పేర్కొన్నారు.