ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపుకు మరొక అవకాశం

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు చెల్లింపునకు మరొక అవకాశం కల్పించింది. ఏప్రిల్ 20, 21 వ తేదీలలో 5 వేల రూపాయల ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ఇంటర్మీడియట్ బోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇంటర్మీడియట్ పరీక్షలు మే 6 నుండి ప్రారంభం కానుండగా ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించుటకు ఇదే చివరి అవకాశంగా భావించి వెంటనే పరీక్ష ఫీజులు చెల్లించని విద్యార్థులు పరీక్ష చెల్లించు కోవాలి.