కరోనా డెంజర్ బెల్స్

దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. తాజాగా మరో 2,067 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,30,47,594కు చేరాయి. ఇందులో 12,340 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,22,006 మంది మరణించారు. మరో 4,25,13,248 మంది కోలుకున్నారు. కాగా, కొత్తగా 40 మంది మహమ్మారికి బలయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 1,547 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారని తెలిపింది.

ఇక దేశంలో కరోనా టీకా పంపిణీ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు 1,86,90,56,607 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని, మంగళవారం 17,23,733 మందికి టీకాలు అందించామని వెల్లడించింది. గత 24 గంటల్లో 4,21,183 మందికి కరోనా టెస్టులు నిర్వహించామని చెప్పింది. మొత్తంగా 83.29 కోట్ల పరీక్షలు నిర్వహించామని తెలిపింది.