సోమవారం డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ ల ఆత్మీయ సమ్మేళనం

  • కాంట్రాక్టు అధ్యాపకుల జేఏసీ చైర్మన్ సీహెచ్ కనక చంద్రంకు ఘన సన్మానం

తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్ ల అసోసియేషన్ నేతృత్వంలో కాంట్రాక్టు అధ్యాపకుల జేఏసీ చైర్మన్ సీహెచ్ కనక చంద్రంకు సోమవారం సాయంత్రం 4 గంటలకు మెదక్ జిల్లా సంఘం తరపున ఘన సన్మానం చేస్తున్నట్లు అధ్యక్షుడు, జేఏసీ కో చైర్మన్ ఎం. వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల పలు సమస్యలను పరిష్కరించడంతో పాటు… ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధంతో కాంట్రాక్టు లెక్చరర్ లందరి క్రమబద్ధీకరణకు పూల బాట వేయడం లో కనక చంద్రం కీలకపాత్ర పోషించారని ఈ సందర్భంగా వినోద్ కుమార్ తెలిపారు.

కావున ఈ సన్మాన కార్యక్రమానికి మెదక్ జిల్లా లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ లెక్చరర్ లు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.