పల్లా రాజేశ్వర్ రెడ్డి కి కృతజ్ఞతలు : శ్రీపతి సురేష్ బాబు

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 371 జీవో అమలు కారణంగా కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు డిస్టృబ్ కాలానికి వేతనాలు చెల్లించడానికి సహకరించిన రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు శ్రీపతి సురేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

డిస్ట్రబ్ అయినా కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు నివాసాలకు దగ్గరలోనే పోస్టింగులు ఇవ్వడంతోపాటు వేతనాలు చెల్లించడం గత 22 సంవత్సరాలలో ఇదే మొదటిసారి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు అన్ని విధాలుగా సహకరిస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు రుణపడి ఉంటారని తెలిపారు. అలాగే కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకన్న, ప్రధాన కార్యదర్శి యార కుమారులకు ఈ సందర్భంగా డిస్టబ్ కాంట్రాక్ట్ లెక్చరర్ ల కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు శ్రీపతి సురేష్ బాబు తెలిపారు.