వేతనాలను సత్వరమే అందేలా చర్యలు తీసుకోవాలి – రేమిడి మల్లారెడ్డి

  • సంవత్సరాలు గడుస్తున్నా అందని వేతనాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు వేతనాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వము తగిన శ్రద్ధ కనబరచడం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు రేమిడీ మల్లారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. 2021 సంవత్సరం నాటి ఫిబ్రవరి మరియు మార్చి నెలలకు సంబంధించి వేతనాలు ఇప్పటికీ అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల విడుదలకై అనేక పర్యాయాలు అధికారులు మరియు ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేసినప్పటికీ నేటికీ వేతనాలు విడుదల చేయకపోవడం చాలా విడ్డూరంగా ఉందన్నారు.

2021 ఫిబ్రవరి, మార్చి, 2022 సంవత్సరం నాటి జనవరి, ఫిబ్రవరి నెలల వేతనాలు సైతం ఇప్పటివరకు కాంట్రాక్టు లెక్చరర్లు పొందలేకపోయారని, తద్వారా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ అప్పులపాలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుబేర్ లో వేతనాల బిల్లులు సమర్పించి రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వం వేతనాలు అందించకపోవడం చాలా బాధాకరం అన్నారు.

వెంటనే ఆర్థిక శాఖ అధికారులు కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ కుబేర్ లో అప్ లోడ్ అయిన వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు