ఇంటర్ తో నేవీ లో 2500 ఉద్యోగాలు

ఇండియన్‌ నేవీ సెయిలర్‌ (AA – SSR).. ఆగస్ట్‌ 2022 బ్యాచ్‌ కోసం సెయిలర్‌ పోస్టుల భర్తీకి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య :- 2500

పోస్టుల వివరాలు :- ఏఏ(ఆర్టిఫీషర్‌ అప్రెంటిస్‌)–500, ఎస్‌ఎస్‌ఆర్‌(సీనియర్‌ సెకండరీ
రిక్రూట్స్‌)–2000.

అర్హతలు :- 60 శాతం లేదా ఆపైన మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌(10+2) ఉత్తీర్ణులవ్వాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

వయోపరిమితి :- 2002 ఆగస్ట్‌ 1 నుంచి 2005 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి.

జీతభత్యాలు :- ట్రైనింగ్‌ పీరియడ్‌లో స్టైపెండ్‌ కింద నెలకి రూ.14,600 చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు లెవల్‌ 3(డిఫెన్స్‌ పే) కింద నెలకు రూ.21,700 నుంచి రూ.69,100.. అదనంగా ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.

ఎంపిక విధానం :- ఇంటర్మీడియట్‌లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని రాతపరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌(పీఎఫ్‌టీ), మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం :- ఆన్లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది :- 29.03.2022

ఆన్లైన్‌ దరఖాస్తులకు చివరితేది :- 05.04.2022

వెబ్సైట్‌: https://www.joinindiannavy.gov.in