చరిత్రలో ఈరోజు : మార్చి 24

◆ దినోత్సవం :-

  • ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం

◆ సంఘటనలు :-

  • 1882: క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్‌క్యులాసిస్ ని రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
  • 1896 చరిత్రలో మొదటి రేడియో ప్రసార సంకేతాలను ఎ.ఎస్.పోపోవ్ సృష్టించాడు.
  • 1977: భారత ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ పదవీ విరమణ.
  • 1977: భారత ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ నియమితుడైనాడు.
  • 1997: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎ.జె.ఎం. అహ్మది పదవీ విరమణ.
  • 1998: భారత లోక్‌సభ స్పీకర్‌గా జి.యమ్.సి.బాలయోగి పదవిని స్వీకరించాడు.
  • 1998: పశ్చిమ బెంగాల్లో దంతన్ ప్రాంతంలో భయంకర టోర్నడో ఫలితంగా 250 మంది ప్రజల మరణం.3000 మంది గాయపడ్డారు.
  • 2008: ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణకోసం ఏర్పాటు చేసిన సంఘం), తన నివేదికను ఈ రోజున ఆర్థిక శాఖామంత్రికి సమర్పించింది.

◆ జననాలు :-

  • 1775: ముత్తుస్వామి దీక్షితులు, భారత దేశానికి చెందిన కవి, రచయిత, వాగ్గేయకారుడు. (మ.1835)
  • 1914: పుట్టపర్తి నారాయణాచార్యులు, తెలుగు పదాలతో ‘‘శివతాండవం’’ ఆడించిన కవి, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు.
  • 1984: ఆడ్రియన్ డీసౌజా, భారత హాకీ క్రీడాకారుడు.

◆ మరణాలు :-

  • 1603: ఇంగ్లాండ్ యొక్క ఎలిజబెత్ I, ఇంగ్లాండు మహారాణి. (జ.1533)
  • 1963: అవసరాల సూర్యారావు, ప్రధానంగా నాటక కర్త అయిన వీరు నల్లబూట్లు, పంజరం మొదలైన నాటికలు రాశారు. పంజరం ఆంధ్ర నాటక పరిషత్తు వారి బహుమానం పొందింది.
  • 1971: ఎర్రమల కొండప్ప, అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1867)
  • 2016: వి.డి.రాజప్పన్, మలయాళ సినిమా హాస్యనటుడు. (మ.1950)
  • 2017: గ్రంధి సుబ్బారావు వ్యాపారవేత్త, దాత, ఆధ్యాత్మికవేత్త. క్రేన్ వక్కపొడి సంస్థ వ్యవస్థాపకుడు.