మార్చి 22 చరిత్రలో ఈరోజు

దినోత్సవం :-

  • ప్రపంచ జల దినోత్సవం

సంఘటనలు :-

  • 1739 : నాదిర్షా ఢిల్లీని ఆక్రమించి నెమలి సింహాసనాన్ని అపహరించాడు.
  • 1946 : బ్రిటిష్ పరిపాలనలో గల జోర్డాన్కు స్వాతంత్ర్యం లభించింది.
  • 1960 : ఆర్థర్ లియొనార్డ్, చార్లెస్ హెచ్ టౌన్స్ లు లేజర్ పై మొదటి పేటెంట్ హక్కులు పొందారు.
  • 1971: భారత లోక్ సభ స్పీకర్గా గుర్‌దయాళ్ సింగ్ థిల్లాన్ పదవి స్వీకారం.
  • 1982 : నాసా యొక్క స్పేస్ షటిల్ “కొలంబియా” కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగింపబదినది.
  • 2000: భారత కృత్రిక ఉపగ్రహం ఇన్సాట్-3బి ప్రయోగం విజయవంతం.

జననాలు :-

  • 1828 : అమరావతి శేషయ్య శాస్త్ర్రి, ఎండోమెంటు డిప్యూటీ కలెక్టరుగా రెండున్నర లక్షల ఒరిజనల్ క్లైమ్సు పత్రాలను పరిశీలించి అనేక వేలఎండోమెంటు క్లైమ్సులు పరిష్కరించాడు. (మ.1903)
  • 1868 : అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ మిల్లికాన్ (మరణం1953)
  • 1900: యజ్ఞనారాయణ శాస్త్రి, తెలుగు రచయిత, కవి, శతావధానులు.
  • 1920: కట్సుకో సరుహషి జపాన్ దేశానికి చెందిన భూరసాయన శాస్త్రవేత్త. (మ.2007)
  • 1907: టేకుమళ్ల కామేశ్వరరావు, విమర్శకుడు.జానపద వాజ్మయం లోనూ, బాల వాజ్మయం లోనూ ఎక్కువగా కృషి చేశాడు. పాత పాటలు జోల పాటలు సేకరించి ప్రచురించాడు
  • 1947: ఎడ్మ కిష్టారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. (మ. 2020)

మరణాలు :-

  • 1832: గేథే, జర్మనీ రచయిత. (జ.1749)
  • 2005: జెమినీ గణేశన్, తమిళ నటుడు. (మ.2005)
  • 2007: ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి, తత్వవేత్త. (జ.1918)
  • 2009: టి.ఎల్. కాంతారావు, తెలుగు సినిమా నటుడు. (జ.1923)
  • 2016: మల్లెల గురవయ్య, కవి, మదనపల్లె రచయితల సంఘం (మరసం) వ్యవస్థాపక అధ్యక్షుడు. (జ.1939)