ఎస్జిటీ టీచర్ పోస్టులే 6,500 ఖాళీలు

టీచర్ కొలువుల భర్తీలో ఈ ఏడాది సెకండరీ గ్రేడ్ (ఎన్జీటీ) పోస్టులే అధికంగా భర్తీ కానున్నాయి,6,500కు పైగా ఎన్జీటీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. 2 వేల వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇండగా, 600 వరకు భాషాపండితుల పోస్టులు ఆన్నాయి. విద్యాశాఖ అధికారులు.. సోమవారం ఆర్థికశాఖ అనుమతి కోసం పంపనున్నారు.

ఖాళీల్లో ఎస్జిటీ పోస్టులన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనుండగా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను 70 శాతం పదోన్నతులు , 30 శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు.

పీడీ, పీఈటీ, డ్రాయింగ్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, ఒకేషనల్ టీచర్ పోస్టులు జిల్లాల వారీగా 10 లోపే ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

సెకండరీ ఎడ్యుకేషన్ లో 18,086 పోస్టులను భర్తీచేయనున్నట్టు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ పోస్టుల్లో పాఠశాల విద్యా శాఖ, మోడల్ స్కూల్స్, తెలంగాణ గురుకుల విద్యాలయాల సొసైటీ, పాఠ్యపుస్తక ముద్రణ సంస్థ, ఎన్సిఈఆర్టీ, గ్రంథాలయాలు వంటివి ఉన్నాయి.

10, 900 పోస్టులు పాఠశాల విద్యాశాఖలోనే ఉన్నట్టు తెలిసింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలో జిల్లా క్యాడర్ పోస్టులు 10,500కు పైగా, జోనల్ క్యాడర్ పోస్టులు 28, మల్టీ జోనల్ క్యాడర్ పోస్టులు 186, ఇతర క్యాడర్ పోస్టులు ఉన్నట్టు సమాచారం.

టీచర్ పోస్టుల ఖాళీల వివరాలు:

ఎస్జీటి: 6,500
స్కూల్ అసిస్టెంట్స్: 2,000
ఎల్‌పీ: 600
పీఈటీ: 160
మోడల్ స్కూల్స్: 750
తెలంగాణ గురుకులాలు: 93

ఇవేకాకుండా మరో 400 వరకు ఎస్సీఈఆర్టీ, పాఠ్య పుస్తక ముద్రణాసంస్థ, గ్రంథాలయాలు, వయోజన విద్య, జవహర్ బాలభవన్, సైట్, ప్రభుత్వ పరీక్షల విభాగంలోనూ పోస్టులను భర్తీ చేస్తారు.

కొన్ని జిల్లాల్లో పోస్టుల వివరాలిలా…

ఖమ్మం 342
జనగామ 101
ఆదిలాబాద్ 203
యాదాద్రి భువనగిరి 125
వరంగల్ 106
జగిత్యాల 159
మహబూబాబాద్ 256
పెద్దపల్లి 20
రాజన్న సిరిసిల్ల 32
కరీంనగర్ 123
భూపాలపల్లి 139
ములుగు 108
వనపర్తి 51
కుమ్రంభీం ఆసిఫాబాద్ 222
మంచిర్యాల 172

courtesy : ntnews