ప్రాక్టికల్ పరీక్షలకు హెల్ప్ లైన్ నంబర్

తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలో మార్చి 23 నుండి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించడానికి షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కళాశాల ప్రిన్సిపాల్స్, పేరెంట్స్, విద్యార్థుల సందేహాల నివృత్తి కోసం హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు బోర్డు తెలిపింది.

హెల్ప్ లైన్ నెంబర్ ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.

హెల్ప్ లైన్ నంబర్ :- 040 – 24600110

మెయిల్ ఐడీ :- helpdesk-ie@telangana.gov.in