డిపార్ట్మెంటల్ అధికారులు యధావిధిగా కొనసాగింపు పట్ల హర్షం

  • TIPS, TGO సంఘాలు హర్షం
  • ఇంటర్మీడియట్ బోర్డు ముందు నిరసన ఫలితమే TIPS, TGO

ప్రాక్టికల్ పరీక్షలకు డిపార్ట్మెంటల్ అధికారులు ఎప్పటిలాగానే ఉంటారని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకోవడం పట్ల TIPS, TGO సంఘ ప్రతినిధులు జంగయ్య, రామకృష్ణ గౌడ్, అస్నాల శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.

డిపార్ట్మెంట్ లో అధికారులు లేకుండానే ఈ సంవత్సరం ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నట్లు అపోహలు సృష్టించి ఇంటర్మీడియట్ పరీక్షల పై అపనమ్మకం ఎర్పడేలా చేయాలని కొందరు వదంతులు సృష్టించారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.

ఈ రోజు ప్రాక్టికల్స్ పరీక్షలకు కచ్చితంగా డిపార్ట్మెంటల్ అధికారులను నియమించాలని, ఎలాంటి కార్పొరేట్ ఒత్తిళ్లకు బోర్డు తలోగ్గదని కార్యాలయం ముందు TIPS, TGO సంఘాల నేతలు భారీ ఎత్తున నిరసన తెలపడంతో బోర్డు డిపార్ట్మెంటల్ అధికారులను యధావిధిగా కొనసాగించడానికి నిర్ణయం తీసుకుందని సంఘ ప్రతినిధులు తెలిపారు. ఈ నిర్ణయం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.