డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ ల వేతనాలు విడుదల పట్ల హర్షం : TGDCLA

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న 811 మంది డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ లకు డిసెంబర్ 2021 నుండి మార్చి 2022 వరకు గల పెండింగ్ వేతనాల కొరకు దాదాపు 19.11 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కాలేజీయోట్ ఎడ్యుకేషన్ కమీషనర్ ఉత్తర్వులు జారీచేశారు.

ఈ సందర్భంగా TGDCLA రాష్ట్ర అధ్యక్షుడు యం. వినోద్ కుమార్ వేతనాల విడుదలలో సహకారాన్ని అందించిన రాష్ట్ర ఆర్ధికమంత్రి శ్రీ హరీష్ రావుకి ఎమ్మెల్సీ డా. పల్లా రాజేశ్వర్ రెడ్డికి, కమిషనర్ కి అందరి అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.