20 జూనియర్ కళాశాలల్లో డిజిటల్ తరగతులు

  • జూనియర్ కాలేజీలకు రూ.20 కోట్లు
  • 1,550 డ్యూయల్ డెస్క్ బల్లలకు రూ.13.6 కోట్లు
  • ల్యాబ్ పరికరాల కోసం రూ.50 లక్షలు
  • వచ్చే విద్యాసంవత్సరంలోఏర్పాటుకు చర్యలు

పాఠశాల విద్యతరహాలో ప్రభుత్వ జూనియర్ కాలే జీలు డిజిటల్ తరగతుల వైపు అడుగులేస్తున్నాయి. అధునాతన బోధనా పద్ధతులను అందిపుచ్చుకొంటున్నాయి. 2022-23 విద్యాసంవత్సరంలో 20 కాలేజీల్లోని తరగతులను డిజిటల్ గా తీర్చిదిద్దేందుకు రూ.20 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేసింది. రాష్ట్రంలో మొత్తం 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. వీటిల్లో 1,96, 421 మంది విద్యార్థులు న్నారు. వీరిలో ఫస్టియర్ లో 1, 10, 180 మంది, సెకండియర్ లో 86,291 మంది ఉన్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో విద్యార్థుల కోసం టీశాట్,

యూట్యూబ్ చానళ్లు, జూమ్ వంటి యాప్లను ఉప యోగించి పాఠ్యాంశాలను బోధించారు. తాజాగా డిజి టల్ తరగతి గదుల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులను కేటాయించడంతో కాలేజీల్లో బోధన కొత్తపుంతలు తొక్కనున్నది.

1,550 డ్యూయల్ డెస్క్ బల్లలు..

కళాశాలల్లో పాడైపోయిన ఫర్నిచర్, పాత ఫర్ని చర్‌ను వినియోగించలేని పరిస్థితులున్నాయి. 1,550 డ్యూయల్ డెస్క్బల్లల కోసం నిధులు కోసం ప్రతిపాదనల్లో సూచించిన మేరకు సూచించిన రూ.18.6 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. జైళ్ల శాఖ ద్వారా లేదంటే ప్రైవేట్ తయారీదారుల నుంచి వీటిని సేకరించాలని ఇంటర్ విద్య అధికారులు యోచిస్తున్నారు. జూనియర్ కాలేజీల్లోని ప్రయోగ శాలల్లో పరికరాల కొనుగోలుకు రూ.50 లక్షలను ప్రభుత్వం కేటాయించింది. ఏటా కొన్ని కాలేజీ . లను ఎంపికచేసి ల్యాబ్ ఉపకరణాలను సమకూరు స్తున్నారు. వచ్చే సంవత్సరానికి రూ.50 లక్షలను ఇందుకోసం కేటాయించారు. పలు పరికరాలను కొనుగోలు చేయనున్నారు.

Courtesy – ntnews