మార్చి 27న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష

ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు అందజేసే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్టేట్ లెవల్ ఎగ్జామ్ మార్చి 27న నిర్వహించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు.

ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.

దరఖాస్తు చేసుకొన్న విద్యార్థులు ఈ నెల 21 నుంచి http//bse.telangana.gov.in వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు.