ఇంటర్ వొకేషనల్ కోర్సులు, సిలబస్ మార్పు

వొకేషనల్ కోర్సులు, సిలబస్ ను మార్చేందుకు ఇంటర్ విద్యశాఖ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. వర్తమాన అవసరాలు, మార్కెట్ డిమాండ్ కు అవసర మైన సిలబస్ ను రూపొందించేందుకు ప్రతిష్టాత్మక సెంచూరియన్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకోన్నారు.

రాష్ట్రంలోని 184 జూనియర్ కాలేజీల్లో.. ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, అగ్రికల్చర్, హోమ్ సైన్స్, పారామెడికల్, బిజినెస్ అండ్ కామర్స్, హ్యుమానిటీస్ వంటి 22 రకాల వొకేషనల్ కోర్సులు నిర్వహిస్తున్నారు. వీటి సిలబస్, కరిక్యులం అప్పుడేప్పుడో రూపొందించింది కావటంతో విద్యార్థులు నైపుణ్యాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త సిలబస్ రూపకల్పనకు అధికారులు కస రత్తు చేస్తున్నారు.