సికింద్రాబాద్ లోని కస్తూరిబా గాంధీ మహిళా జూనియర్ కళాశాలలో ఈ నెల 19న ఒకేషనల్ విద్యార్థులకు అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ డిప్యూటి డైరెక్టర్ లక్ష్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
గత మూడేళ్ల క్రితం మరియు 2019– 21 విద్యా సంవత్సరాలలో ఉత్తీర్ణులైన ఓకేషనల్ విద్యార్థిని, విద్యార్థులు హజరు కావచ్చని తెలిపారు.
పారా మెడికల్ కోర్సులకు ఈ నెల 19న ఉ:10 గంటలకు,
నాన్ పారా మెడికల్ కోర్సులకు మధ్యాహ్నం 1 గంటకు హజరు కావాల్సి ఉంటుంది.
ఒరిజినల్ సర్టిఫికేట్స్, 3 జిరాక్స్ సెట్స్ బయోడేటా, ఫోటోలో పాల్గొనాలని కోరారు.
ఎంపికైన వారికి నెలకు రూ 7500 స్టైఫండ్ ఇవ్వబడుతుందని తెలిపారు.