కళాశాల లాగిన్ లో ప్రాక్టికల్స్ టైమ్ టేబుల్, హల్ టికెట్స్, ప్రశ్న పత్రాలు

తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 23 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షకు సంబంధించిన ప్రశ్నా పత్రాలు, విద్యార్థుల హాల్ టికెట్లు, పరీక్ష టైం టేబుల్, మరియు బ్యాచ్ ల వారీగా హల్ టికెట్ల నంబర్లు కళాశాల లాగిన్ వెబ్ సైట్ లో ఇంటర్మీడియట్ బోర్డ్ అందుబాటులో ఉంచింది.

ఆన్లైన్ ఎగ్జామినేషన్ సర్వీసెస్ లో ప్రశ్నాపత్రాలను అందుబాటులో ఉంచింది. వీటిని ముందుగానే డౌన్లోడ్ చేసుకుని అన్ జిప్ / ఎక్సాట్రాక్ట్ చేసుకొని ఒక ఫోల్డర్ లో సేవ్ చేసుకోవలసి ఉంటుంది.

రిపోర్ట్స్ విభాగంలో విద్యార్థుల హాల్ టికెట్లు, టైంటేబుల్, బ్యాచ్ వైజ్ గా అందుబాటులో ఉన్నాయి.