డిపార్ట్ మెంటల్ అధికారులు లేకుండానే ప్రయోగ పరీక్షలు

హైదరాబాద్: రాష్ట్రంలో ఈసారి ఇంటర్ ప్రయోగ పరీక్షలు డిపార్ట్ మెంటల్ అధికారులు లేకుండానే జరగనున్నాయి. సాధారణంగా ప్రాక్టికలకు ఇతర కళాశాల అధ్యాపకుణ్ని ఎటర్నల్ ఎగ్జామినర్‌గా నియమిస్తారు. ఆయనతోపాటు ఇంటర్ బోర్డు తరఫున ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులను కూడా పర్యవేక్షణ నిమిత్తం డిపార్ట్ మెంట్ అధికారు లుగా నియమిస్తారు. ఈసారి ప్రయోగ పరీక్షలు ఈ నెల 23న ప్రారంభం కానున్నాయి. వాటికి డిపార్ట్ మెంట్ అధికారులు ఉండరు.

కరోనా నేపథ్యంలో సెప్టెంబరు 1 నుంచి జూనియర్ కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దాదాపు 15 రోజులపాటు అధ్యాపకులను డిపార్ట్ మెంట్ అధికారులుగా నియమించడం వల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు నష్టం జరుగుతోందని, ఈసారి కూడా ఎంసెట్లో వెయిటేజీ లేనందున ప్రాక్టికల్ మార్కులు అంత ముఖ్యం కాదని అధికారులు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు. దాదాపు 2 వేల కళాశాలల్లో ఈనెల 23 నుంచి ప్రాక్టికల్స్ జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు : లక్షల మంది విద్యార్థులు పాల్గొననున్నారు.

Courtesy : Eenadu