మార్చి 18 చరిత్రలో ఈరోజు

సంఘటనలు

  • 1922: మహత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు 6 సంవత్సరముల జైలు శిక్ష విధించబడ్డాడు.
  • 1965: అలెక్షీ లియనోవ్ అనే రోదసీ యాత్రికుడు తన అంతరిక్ష నౌక వోస్కోడ్ 2 నుండి 12 నిముషాలు బయటకు వచ్చి అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు.
  • 1998: భారత ప్రధానమంత్రిగా ఐ.కె. గుజ్రాల్ పదవీ విరమణ.

జననాలు

  • 1837: గ్రోవర్ క్లీవ్‌లాండ్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
  • 1858: రుడ్ఫోల్ఫ్ డీసెల్, జర్మన్ ఆవిష్కర్త (మ.1913)
  • 1933: దండమూడి రామమోహనరావు, మృదంగం వాయిద్యకారుడు.
  • 1938: శశి కపూర్, చలనచిత్ర నటుడు.
  • 1953: టి.దేవేందర్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో అనేక మంత్రిపదవులను చేపట్టిన రాజకీయ నాయకుడు

మరణాలు

  • 1804: వెలుగోటి కుమార యాచమ నాయుడు వెంకటగిరి సంస్థానాన్ని పాలించిన జమీందారు. (జ.1762)
  • 1871: అగస్టస్ డీ మోర్గాన్, భారత సంతతికి చెందిన గణిత, తర్క శాస్త్రవేత్త. (జ.1806)
  • 2017: చంద్రహాసన్, రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ అధినేత, సినిమా నిర్మాత.
  • 2019: బొమ్మ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. మాజీ శాసన సభ్యుడు.

దినోత్సవం :-

  • మానవ హక్కుల దినం.