క్రమబద్దీకరణ పట్ల ధన్యవాదాలు

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్స్, ఉద్యోగులను క్రమబద్దీకరించే నిర్ణయం చేసినందుకు ఈ రోజు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంటర్మీడియట్ కమీషనర్ ఉమర్ జలీల్ లను TIGLA, TIPS కన్వీనర్ మాచర్ల రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో కలిసి ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందని క్రమబద్దీకరణ సాదన సమితి కన్వీనర్ డా. కొప్పిశెట్టి సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కాంట్రాక్ట లెక్చర్స్ రాష్ట్ర అధ్యక్షుడు జి ఉదయభాస్కర్, 475 సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ శోభన్ బాబు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గంగాధర్, హైదరాబాద్ జిల్లా నాయకులు విశాలాక్ష్మి, ఖమ్మం జిల్లా నాయకులు మురళీకృష్ణ, పాలిటెక్నిక్ రాష్ట్ర నాయకులు నవీన్, డిగ్రీ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.