క్రమబద్దీకరణకు చర్యలు ప్రారంభం

ముఖ్యమంత్రి కేసీఆర్ 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వివిధ శాఖల కార్యదర్శులు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

80 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి చేపట్టవలసిన చర్యలు, 11 వేల మంది ఉద్యోగుల క్రమబద్దీకరణ కోసం తీసుకోవాల్సిన చర్యల మీద కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయవలసిందిగా సోమేష్ కుమార్ ఆదేశించినట్లు సమాచారం.