ప్రాక్టికల్స్ పై అపోహలు నమ్మవద్దు.

ఇంటర్ విద్యా కమీషనర్ ను TIGLA, TIPS, కాంట్రాక్ట్ లెక్చరర్ ల సంఘ నేతలు కలవడం జరిగింది. ఈ సందర్భంగా పలు సమస్యలను దృష్టికి తీసుకొని వెళ్లగా వారు సానుకూలంగా స్పందించారని సంఘ ప్రతినిధులు తెలిపారు.

మార్చి 23 నుండి జరగబోయే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు ప్రవేట్ కళాశాలల పరీక్ష కేంద్రాలలో గతంలో మాదిరి ఇంటర్మీడియట్ బోర్డు ప్రతినిధిగా డిపార్ట్మెంట్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్(DO) ను ప్రభుత్వ కళాశాల పనిచేస్తున్న లెక్చరర్స్ ను పంపాలని కోరగా కచ్చితంగా ప్రవేట్ పరీక్ష కేంద్రాలలో డిపార్ట్మెంటల్ అధికారి ఉంటారని ఎలాంటి అపోహలను నమ్మొద్దని చెప్పారు.

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల కన్నా ముందు అధికారులు మరియు అధ్యాపక సంఘాలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారని సంఘ ప్రతినిధులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో TIGLA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & TIPS రాష్ట్ర కన్వీనర్ మాచర్ల రామకృష్ణ గౌడ్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & జీవో నెంబర్ 16 కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అమలు సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, డిగ్రీ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు ఉదయ్ బాస్కర్, శ్రవణ్, 475 సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గంగాధర్, గోవర్ధన్ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఉదయశ్రీ, ఖమ్మం జిల్లా నాయకులు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.