పింగళి ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు

హన్మకొండ : పింగళి ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ప్రిన్సిపాల్ కవిత అధ్యక్షతన జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా కడియం ఫౌండేషన్ చైర్మన్ డా.కడియం కావ్య, విశిష్ట అతిథిగా ప్రముఖ విద్యావేత్త అస్నాల శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్యార్థినిలు ప్రదర్శించిన సాంస్కృతిక, సంగీత, నృత్య రూపాలు హోరెత్తించాయి.

ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ మట్టిలో మాణిక్యాలను వెలికితీసేవి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అని అన్నారు. సృజనాత్మక, సామాజిక భాద్యత గల నవ్య మానవులను రూపొందిస్తాయన్నారు. అవకాశాలలో సమానత్వం ఉంటే స్త్రీలు ఎక్కువ నిర్వహణ సామర్ధ్యం ప్రదర్శిస్తారని అన్నారు.

అస్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ చదువుతో సంపద కలుగుతుందని, సంపద తోని పురోగతి వస్తుందని చెప్పిన సావిత్రి పూలే బాటలో నడవాలని కోరారు.

ప్రిన్సిపాల్ కవిత మాట్లాడుతూ చదువుతున్న వెయ్యి మంది బాలికల సమగ్ర వికాసానికి కృషి చేస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమములో యన్ యస్ యస్ అధికారులు కవిత, రమేష్, అధ్యాపకులు వెంకటరమణ, మంజుప్రద, రజిత, సత్తెమ్మ, అజయ్, మధు, వసంత, మొగిలి, స్వామి, సురేష్, శ్రీకళ మరియు వెయ్యి మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.