6 నెలల్లో అన్ని ఉద్యోగ నోటిఫికేషన్స్ – కేటీఆర్

తెలంగాణ లో వచ్చే 6 నుండి 9 నెలల మధ్య కాలంలో 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు దశలవారీగా విడుదలవుతాయని, కావున అభ్యర్థులందరూ ఎలాంటి అపోహలకు గురికాకుండా చక్కగా ప్రిపేర్ కావాలని అందుకు సంబంధించిన అనేక ఏర్పాట్లను ప్రభుత్వం మండల స్థాయి నుంచి చేస్తుందని కేటీఆర్ తెలిపారు.

నూతన ఆసరా ఫించన్లు జూన్ నుండి

తెలంగాణ రాష్ట్రంలో 57 సంవత్సరాలు నిండిన 7 లక్షలకు పైగా వయోజనులకు నూతన ఆసరా పింఛన్లులను జూన్ మాసం నుండి చెల్లించడానికి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.