బదిలీలు ఉద్యోగ జీవితంలో సహజం – ప్రిన్సిపాల్ కొమ్ము రజిత

జోగిపేట : ప్రభుత్వ జూనియర్ కళాశాల జోగిపేట లో ఈ రోజు 317 జీవో ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాల జోగిపేట నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల భధ్రాచలం కి బదిలీ అయిన గణిత అధ్యాపకుడు హరీష్ కుమార్ కి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సమావేశానికి అధ్యక్షుత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ కొమ్ము రజిత మాట్లాడుతూ కళాశాలకు హరీష్ చేసిన సేవలు మరిచిపోలేనివని. బదిలీలు ఉద్యోగుల జీవితంలో సహజమని 317 జీవోలో అన్యాయం జరిగిన అధ్యాపకులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు.

బదిలీపై వెళ్ళిన అధ్యాపకుడు హరీష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో గణిత అధ్యాపకునిగా రెండు సంవత్సరాలకు పైగా సేవలందించానని గొప్ప అనుభూతి లభించిందని తెలిపారు.

ఈ కార్యక్రమం లో అధ్యాపకులు శ్రీనివాస్ ,విఠల్,శ్రావణ్ కుమార్, గోవర్ధన్ రెడ్డి, అనిత, మల్లేశం, శ్రీకాంత్, శివలక్ష్మీ‌, రషీద్, నాగరాజు, బాలరాజు, విద్యార్థినివిద్యార్థులు పాల్గొన్నారు.