జీజేసీ తాడ్వాయిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకల

ప్రభుత్వ జూనియర్ కళాశాల తాడ్వాయిలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు.

తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఉపాధ్యక్షుడు, కళాశాల ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ ములుగు జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరచడంలో శ్రీనివాస్ గౌడ్ కృషి చేస్తున్నాడు అని తెలిపారు. మానవ నాగరికత ఆనవాళ్లు, సాంస్కృతిక అభివృద్ధిని తెలియచేసే డాల్మండ్ సమాధులు, రామప్ప వంటి అనేక నిర్మాణాలకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తేవడంలో కృషి చేసారని అన్నారు. హరిత హోటల్ లు ఏర్పాటుతో పర్యాటకుల రాకతో స్థానిక యువతకు ఉపాధి లభిస్తున్నదని తెలిపారు. ఈ సందర్బంగా విద్యార్థులకు పండ్లను పంపిణీని చేశారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మూర్తి, శ్వేత, కిషన్, శ్రీలత, రాజ్ కుమార్, రాజు, అశోక్, నాగరాజులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.