ఇంటర్ పరీక్షల తేదీలలో JEE MAIN 2022 పరీక్షలు

JEE MAIN 2022 పరీక్షల ను రీషెడ్యూల్ చేస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది.. తాజా షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఎప్రిల్ 21, 24, 25, 29 మరియు మే 1, 4 తేదీలలో నిర్వహించనున్నారు.

అయితే గతం లో ఇచ్చిన షెడ్యూల్ కారణంగా తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ ను ఎప్రిల్ 22 నుంచి రీషెడ్యూల్ చేశారు. తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ JEE MAIN పరీక్షలను రీషెడ్యూల్ చేయడంతో మరల ఒకే తేదీలలో ఇంటర్ పరీక్షలు JEE MAIN పరీక్షలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏ నిర్ణయం తీసుకోనుందో అని కళాశాల లు మరియు విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.