15 నుండి ఒంటి పూట బడులు

తెలంగాణ రాష్ట్రంలో మార్చి 15వ తేదీ నుండి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 8.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాలలు నడవనున్నాయి. మధ్యాహ్న భోజనం యధావిధిగా కొనసాగుతోంది.

అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 23 వరకు పాఠశాలలు పని చేయాల్సి ఉంది మే 17వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. కావునా పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించుకునే వెసులుబాటు కల్పించారు.