మేడారం ఆశ్రమ పాఠశాలలో జీజేసీ తాడ్వాయి అడ్మిషన్ డ్రైవ్

విద్యార్థులు తమ శక్తి, సామర్ధ్యాలు ఆసక్తి మేరకు ఉన్నత విద్యా కోర్సులను ఎంపిక చేసుకోవాలని ప్రముఖ విద్యావేత్త, ప్రభుత్వ జూనియర్ కళాశాల తాడ్వాయి ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్ అన్నారు. మేడారం ఆశ్రమ పాఠశాలలో ఇంటర్మీడియట్ అడ్మిషన్ డ్రైవ్ లో బాగంగా “21వ శతాబ్ద ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల”పై నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా మాట్లాడారు.

శాస్త్ర సాంకేతిక, సామాజిక శాస్త్రాలలో జ్ఞాన విస్ఫోటనం చెందుతున్నదని, వాటిపై పట్టు సాధించాలని కోరారు. అనుకున్న లక్ష్యాల సాధనలో కాలాన్ని సమర్ధవంతంగా వాడుకోవాలని కోరారు. విద్యార్థినిల అడిగిన కెరీర్ సందేహాలను నివృత్తి చేస్తూ లక్ష్యాలకు చేరువయ్యే మార్గాన్ని, అభ్యసన నైపుణ్యాలను బోధించారు.

ఈ కార్యక్రమములో ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సరోజన, అధ్యాపకులు మూర్తి, శ్వేత, రాజ్ కుమార్ వందలాది మంది విద్యార్థినిలు పాల్గొన్నారు.