ఇతర శాఖలకు వీఆర్వోలు.!

గ్రామ రెవెన్యూ అధికారుల (VRO)కు గ్రేడింగ్ ఇవ్వాలంటూ తహసీల్దార్ లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే వారి సర్వీస్ కు సంబంధించిన డేటా కోసం ఒక ప్రొపార్మా కూడా సిద్ధం చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా 5,384 మంది వీఆర్వో లు పని చేస్తున్నట్లు సమాచారం. ఇందులో 1300 మంది నేరుగా నియమించబడ్డారు. మిగతా వారిని వివిధ శాఖలలో సర్దుబాటు చేయడానికే ప్రభుత్వం యోచిస్తోందని అధికారుల వర్గాల అభిప్రాయం.

గ్రేడింగ్ చేయడం వలన తమ సర్వీస్ కు సంబంధించిన పే స్కేల్, పదోన్నతులు‌ వంటి సమస్యలు పరిష్కార అవుతాయని వీఆర్వో లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.