ఎస్సీ విద్యార్థులకు వనస్థలిపురంలో ఉచిత శిక్షణ

బీఎస్సీ నర్సింగ్, జీఎస్ఎం నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన ఎస్సీ విద్యార్థులకు ఉపాధి అవకాశాల కోసం ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో 6 నెలల పాటు ఉపాధి శిక్షణ,ఉచిత వసతి కల్పిస్తున్నట్లు నిర్వాహకులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

నర్సింగ్ లో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన ఎస్సీ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఐఈఎల్ టీఎస్, ఓఈటీ, స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్, స్కిల్, పర్సనాలిటీ డెవలప్మెంట్ తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చి పాస్ పోర్ట్ ఇప్పించి విదేశాలకు పంపిస్తున్నట్టు తెలిపారు.

ఆసక్తిగల విద్యా ర్థులు వనస్థలిపురం బాటా షోరూం సై ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు . వివరాలకు 9848581100, 9949187426లో సంప్రదించాలన్నారు.