త్వరలో కేసీఆర్ కు ధన్యవాద సభ – కాంట్రాక్టు ఉద్యోగులు

  • పల్లా తో భేటీ అయినా వందలాది కాంట్రాక్టు అధ్యాపకులు
  • తమ కుటుంబాల తరపున కేసీఆర్, ప్రభుత్వానికి ధన్యవాదాలు

సీఎం కేసీఆర్‌, ప్రభుత్వానికి కాంట్రాక్టు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో 11వేల మంది కాంటాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తానని తీసుకున్న నిర్ణయానికి సంతోషిస్తూ కాంటాక్టు వ్యవస్థలో పని చేస్తున్న జూనియర్‌ కళాశాల, డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్‌ కాలేజీ, రెసిడెన్షియల్‌ కాలేజీల సంఘాల రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి నాయకులు, వందల సంఖ్యలో కాంట్రాక్టు అధ్యాపకులు సీఎం కేసీఆర్‌, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపేందుకు తెలంగాణ రైతు బంధు సమితి అధ్యక్షుడు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో రాష్ట్రస్థాయి ధన్యవాద సభను ఏర్పాటు చేసి కేసీఆర్‌కు కృతజ్ఞత తెలుపుతామని చెప్పారు. కార్యక్రమంలో కాంట్రాక్టు డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్, జూనియర్ కాలేజీ నుంచి కనక చంద్రం, గాదె వెంకన్న, సురేష్, రమణారెడ్డి, రహీమ్, పాలిటెక్నిక్ కళాశాలల నుండి ఉమా శంకర్, అస్మతుల్లా ఖాన్, ఇమ్మాన్యుయోల్ తదితరులు పాల్గొన్నారు.