జూనియర్ కళాశాల జూలపల్లిలో కెసిఆర్, హరీష్ రావుల చిత్రపటానికి పాలాభిషేకం

ప్రభుత్వ జూనియర్ కళాశాల జూలపల్లి పని చేస్తున్న కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులు సీఎం కేసీఆర్ నిన్న శాసనసభలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చేసిన ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కెసిఆర్, హరీష్ రావుల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా కాంట్రాక్టు అధ్యాపకులు మాట్లాడుతూ తమ 20 ఏళ్ల శ్రమను కేసీఆర్ గుర్తించి నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. అలాగే క్రమబద్ధీకరణ అయిన తర్వాత మరింత అంకిత భావంతో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ మరియు పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతినబూనారు.

ఈ కార్యక్రమంలో జే. పవన్ కుమార్, జి. సురేష్ కుమార్, బి. రాజమల్లు, ఎమ్. వనిత, ఎమ్. స్వప్న, సీహెచ్. రమేష్, ఎస్.కే. ఖాసీం సాహెబ్, వి. మహేందర్ తదితరులు పాల్గొన్నారు.