ప్రభుత్వ కళాశాల హుస్నాబాద్ లో కేసీఆర్, హరీష్ రావు పటాలకు పాలాభిషేకం

ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, హుస్నాబాద్ యందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి మరియు ఆర్థిక శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావుకి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ నల్లా రాంచంద్రారెడ్డి ప్రారంభించడం జరిగింది.

తెలంగాణ రాష్ట్రలో పనిచేస్తున్న 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించిన కేసీఆర్ నిర్ణయంపై కళాశాల ప్రిన్సిపాల్ నల్లా రాంచంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అనంతరం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు తన్నీరు హరీష్ రావు చిత్ర పటాలకు కళాశాల ప్రిన్సిపల్ నల్లా రాంచంద్రారెడ్డి మరియు కళాశాల అధ్యాపక బృందం అందరు కలిసి “క్షీరాభిషేకం” చేయడం జరిగింది.

అసెంబ్లీలో కేసీఆర్ వ్యక్తపరిచిన కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ నిర్ణయానికి తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్ట్ అద్యాపకులు అందరు కేసీఆర్ కి మరియు హరీష్ రావు కి కృతజ్ఞతలు తెలుపుతూ వారికి జీవితాంతం ఋణపడి ఉంటామని మనస్పూర్తిగా తెలుపడం జరిగింది. ఈ నిర్ణయంతో కాంట్రాక్ట్ అద్యాపకుల జీవితంలో వెలుగులు నింపారని కాంట్రాక్ట్ లెక్చరర్ల రాష్ట్ర అధ్యక్షులు కనకచంద్రం మరియు జిల్లా అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంట్రాక్ట్ అద్యాపకుల సంఘం రాష్ట్ర నాయకులు శ్రీ డి. కరుణాకర్, కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి శ్రీ బి. లక్ష్మయ్య, సిద్దిపేట జిల్లా కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు, ఎస్. సదానందం, కాంట్రాక్ట్ అద్యాపకులు, డి. రవీందర్, శ్రీమతి పి. వరూదిని, శ్రీమతి ఎస్. కవిత, శ్రీమతి కె. స్వరూప, శ్రీమతి జి. కవిత, ఎ. సంపత్ మొదలగు వారు పాల్గొన్నారు.