సీఎం కేసీఆర్ కి రుణపడి ఉంటాం

తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను అసెంబ్లీ సాక్షిగా రెగ్యులరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన పట్ల తెలంగాణ కాంట్రాక్ట్ లెక్చరర్స్ 711 సంఘం మహబూబ్నగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యం. వెంకట్ రాములు మరియు యు .అరవింద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 22 సంవత్సరాల వెట్టిచాకిరిని పారద్రోలి కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపబోతున్న సీఎం కేసీఆర్ కి జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.

అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఎప్పటికప్పుడు నేనున్నానంటూ మా వెన్నంటి ఉండిన ఆర్థిక శాఖ మాత్యులు, ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ తన్నీరు హరీష్ రావుకి ,అదేవిధంగా మున్సిపల్ మరియు ఐటీ శాఖ మాత్యులు శ్రీ కేటీఆర్ కి , విద్యా శాఖ మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి కి, పర్యాటక శాఖ మాత్యులు శ్రీనివాస్ గౌడ్ కి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి, అధికారులకు మరియు కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్ శ్రీ కనక చంద్రంకి కృతజ్ఞతలు తెలియజేశారు.