కాంట్రాక్టు ఉద్యోగుల కల ఫలించింది : హేమచందర్ రెడ్డి

ఎన్నో ఏళ్ల కల ఫలించిన వేళ* ఈ రోజు సాక్షాత్ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా *
కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసును రెగ్యులర్ చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో వారికి TGCCLA- 711 సూర్యాపేట జిల్లా శాఖ పాలాభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ & జిజేఎల్ఎ సూర్యాపేట జిల్లా జాయింట్ సెక్రెటరీ వీడీయస్ ప్రసాద్ మినిమం టైం స్కేల్ సీనియర్ అధ్యాపకులు బ్రహ్మ చారి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారని హేమచందర్ రెడ్డి తెలిపారు.

సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తు ఈ కార్యక్రమంలో TGCCLA- 711 సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మారం హేమచందర్ రెడ్డి, సీనియర్ అధ్యాపకులు రామ్మూర్తి, నరసింహ రాజు, నాగుల్ మీరా, మరియు రమణారెడ్డి పాల్గొన్నారు.

ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న కృషిని గమనించి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ ఈరోజు సర్వీసును క్రమబద్ధీకరణ చేస్తున్నట్టు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా సంఘం గౌరవ అధ్యక్షుడు శ్రీ హరీష్ రావుకి‌, కాంట్రాక్ట్ లెక్చరర్స్ రెగ్యులరైజేషన్ కు మద్దతు పలికిన శాసనమండలి సభ్యులు కూర రఘోత్తమ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ శ్రీ డాక్టర్ మధుసూదన్ రెడ్డికి మరియు క్రమబద్ధీకరణ సాధన కోసం నిరంతరం అలుపెరుగని కృషి చేసిన అందరికీ మా అందరి ఆరాధ్య నాయకుడు మరియు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనక చంద్రంకి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్కి మరియు మా క్రమబద్ధీకరణకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి సూర్యాపేట జిల్లా కాంట్రాక్ట్ లెక్చరర్స్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు.