పాఠశాలల్లో మహిళా దినోత్సవం వేడుకలు జరపాలని ఉత్తర్వులు

మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ పాఠశాల విద్యాశాఖ పాఠశాలల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు జరిపాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సందర్భంగాజిల్లా విద్యాధికారులకు కొన్ని సూచనలు చేసింది. ప్రతి పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని కార్యక్రమాలను చేపట్టాలని సూచించింది.

  • ఆడపిల్లల్లో పోషణ గురించి అవగాహన కల్పించాలని..
  • మెన్స్ట్రువల్ పరిశుభ్రత గురించి వివరించాలని..
  • సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించాలని..
  • మహిళా విద్య ప్రాధాన్యతను వివరించాలని పేర్కొన్నారు..