త్వరలో టెట్ – 2022

తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు (TET) నిర్వహణకు మంత్రివర్గ ఉపసంఘం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్టు సమాచారం.

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల భర్తీకి ఉద్దేశించిన టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్టు (TRT)కు ముందు టెట్ నిర్వహించాల్సి ఉంటుంది. టెట్ క్వాలిఫై అయినవారే TRT రాయడానికి అర్హులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరు వాత 2016 మే, 2017 జూలైలో టెట్ నిర్వహించారు.

గతంలో ఏడేండ్లు మాత్రమే ఉన్న టెట్ వ్యాలిడిటీని జీవితకాలం పొడిగిస్తూ ఇటీవల నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ఉత్తర్వులు జారీచేసింది.

ఇంతకుముందు టెట్ లో క్వాలిఫై కానివారు, 2017 తర్వాత ఉపాధ్యాయ విద్య కోర్సులను పూర్తి చేసినవారు టెట్ రాయాల్సి ఉంటుంది.