రేపు మహిళా ఉద్యోగులకు సెలవు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 నాడు తెలంగాణ లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ ప్రత్యేక సాధారణ సెలవును ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ విడుదల చేసిన ఉత్తర్వులు జారీ చేశారు.