మార్చి 07 : చరిత్రలో ఈ రోజు

★ సంఘటనలు :-

1969 : లెవి ఎష్కోల్ మరణం తరువాత గోల్డా మీయర్ ఇజ్రాయెల్ యొక్క మొదటి మహిళా ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు.

2009: మహిళల ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటు ఆస్ట్రేలియాలో ప్రారంభమైనది.

2011: యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం

★ జననాలు :-

1921: ఎమ్మెస్ రామారావు, తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. (మరణం.1992)

1938: డేవిడ్ బాల్టిమోర్, అమెరికా జీవశాస్త్రవేత్త నోబుల్ బహుమతి గ్రహీత జననం.

1952: వివియన్ రిచర్డ్స్, వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్.

1955: అనుపమ్ ఖేర్, సినీ నటుడు జననం.

★ మరణాలు :-

1952: పరమహంస యోగానంద, భారతదేశంలో గురువు. (జననం.1893)

1973: అప్పడవేదుల లక్ష్మీనారాయణ, భారతదేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త. కొడైకెనాల్ లోని సూర్య దర్శిని విభాగపు మొదటి అధ్యక్షుడు.

1979: అయ్యంకి వెంకటరమణయ్య, గ్రంథాలయోద్యమకారుడు, పత్రికా సంపాదకుడు. (జననం.1890)

courtesy : wikipedia