మ్యుచువల్ ట్రాన్సపర్స్ కు 870 దరఖాస్తులు

తెలంగాణలో ఉద్యోగ, ఉపాధ్యాయుల మ్యుచువల్ ట్రాన్సపర్స్ కు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైన ఐదు రోజుల తర్వాత 870 దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

వీటిలో 643 జిల్లా క్యాడర్, 227 జోనల్, మల్టీజోనల్ క్యాడర్ కు సంబంధించిన దరఖాస్తులున్నాయి. జిల్లా క్యాడర్ లో అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి 36, నిర్మల్ నుంచి 35, ములుగు నుంచి 38 దరఖాస్తులు అందాయి. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి 7, నిజామాబాద్ నుంచి 8 దరఖాస్తులున్నాయి.